Vikram Vedha Movie On OTT | విక్రమ్, భేతాలుడు కథలను బేస్ చేసుకుని తెరకెక్కిన గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రం ‘విక్రమ్ వేద’. బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదలైన పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించలేకపోయింది. ఫస్ట్ వీకెండ్ పర్వాలేదనిపించిన.. సెకండ్ వీక్ నుండి డల్ అయింది. ఇక ఫైనల్‌గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోకుండానే థియేటర్లలో నుండి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ రిలీజ్ కోసం ప్రేక్షకుల ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద హిట్టయిన సినిమా అయినా సరే నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ విక్రమ్ వేద రిలీజై మూడు నెలలు అయిపోయినా ఇంకా ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ కాలేదు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మూవీను జనవరి 9నుండి ‘జియో సినిమా’, ‘వూట్’ రెండు ప్లాట్‌ఫార్మ్‌లలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.
గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో హృతిక్ గ్యాంగ్‌స్టార్‌గా నటించగా, సైఫ్ ఆలీఖాన్ పోలీస్ అధికారి పాత్ర పోషించాడు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన ‘విక్రమ్ వేద’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ రీమేక్ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైనమెంట్స్, టీ-సిరిస్ ఫిలింస్, ఫ్రైడే ఫిలిం వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్‌కు జోడీగా రాధికా ఆప్టే నటించింది.