లోకనాయకుడు కమల్ హాసన్ సినిమాలు అంటే అభిమానులలో ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, సింగర్‌గా, స్క్రీన్‌రైటర్‌గా, పాటల రచయితగా, టెలివిజన్ హోస్ట్ గా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. కమల్ మూడేళ్ల క్రితం విశ్వరూపం2 లో కనిపించిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత ఆయన భారతీయుడు సినిమాని ప్రారంభించారు.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడింది. దీంతో విక్రమ్ అనే సినిమా మొదలు పెట్టాడు. నగరం, ఖైది, మాస్టర్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో దర్శకుడు లోకేశ్ కనకరాజ్ డైరెక్టర్‌గా తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు సీనియర్ హీరో కమల్ హాసన్‌తో మూవీ చేస్తున్నారు.కమల్ని ఎలా చూపిస్తాడు అని అందరు చూపిస్తున్న నేపథ్యంలో తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో కమల్ ఎంట్రీతో గూస్ బంప్స్ తెప్పించారు.
48 సెకన్ల నిడివి గల వీడియో ఇప్పుడు దుమ్మురేపుతుంది. యూట్యూబ్‌లో దుమారం సృష్టిస్తుంది. ఓ జైల్లో నుంచి తప్పించుకుంటున్న క్రమంలో పోలీసులు వెంటపడుతుంటారు. కాల్పులు జరుపుతుంటారు. పోలీస్ రక్షణ కవచాలను అడ్డుపెట్టుకుని ఒక్కసారిగా ఓపెన్ చేసి తనదైన యాక్షన్ లుక్‌తో కమల్ ఎంట్రీ అదిరిపోయేలా ఉంది. కమల్ బర్త్ డేకి ఇది అదిరిపోయే గిఫ్ట్ అని అంటున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తుండగా, విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.