Vikram Movie | ‘విక్రమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆకట్టుకుంటున్న మేకింగ్ గ్లింప్స్
ప్రేక్షకులలో ప్రస్తుతం సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. ఒక కథను ప్రేక్షకుడు ఆలోచించే విధంగా, తరువాతి సీన్ ఎమవుతుంది అనే క్యూరియాసిటీని పెంచే సినిమాలను చూడటానికే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
Vikram Movie release date | ప్రేక్షకులలో ప్రస్తుతం సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. ఒక సినిమాలో ఆరుపాటలు, మూడు ఫైట్లు, రెండు జోకులు ఉంటే చాలు సినిమా హిట్టయిపోయింది అనుకుంటే పొరపడినట్లే. అలాంటి సినిమాలను ప్రేక్షకులు ఇప్పుడు దగ్గరకి కూడా రానివ్వట్లేదు. ఒక కథను ప్రేక్షకుడు ఆలోచించే విధంగా, తరువాతి సీన్ ఎమవుతుంది అనే క్యూరియాసిటీని పెంచే సినిమాలను చూడటానికే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి సినిమాలను తెరకెక్కించే దర్శకులలో లోకేష్ కనగరాజ్ ఒకరు.
నగరం, ఖైదీ, మాస్టర్ సినిమాలతో లోకేష్ ఎలాంటి అద్భుతమైన సినిమాలను తెరకెక్కించగలడో నిరూపించాడు. ఈ సినిమాలు చూసిన ప్రతి ప్రేక్షకుడు ఒకటే ఆలోచిస్తాడు. అంత సింపుల్ స్టోరి లైన్‌ను ఇంత గొప్పగా ఎలా తీసాడు అనే. ఇండియాలోనే ఇప్పుడున్న బెస్ట్ దర్శకులలో లోకేష్ ఒకడు. సినిమాను ప్రేక్షకుడి ఆలోచన స్థాయికి మించి ఈయన సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్ కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రంపై మొదటి నుంచే భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ గ్లింప్స్ అంచనాలను రెట్టింపు చేశాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్ర విడుదల తేదిను ప్రకటిస్తూ మేకింగ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వీడియోలో తెలిపారు. 118 రోజులు ఈ చిత్ర షూటింగ్‌ను జరిపారు. దానికి సంబంధించిన మేకింగ్ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

