హరికృష్ణ, రామకృష్ణ, యాని, రేఖ నిరోష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తికమకతాండ’. వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ఈ చిత్ర ట్రైలర్ను ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఆద్యంతం వినోదప్రధానంగా సాగే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: హరికృష్ణన్, సంగీతం: సురేష్ బొబ్బిలి, దర్శకత్వం: వెంకట్.