భలే మంచి రోజు, శమంతక మణి, దేవదాస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని అలరించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. చివరిగా నాని, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో దేవదాస్ తెరకెక్కించగా, ఈ చిత్రం అంత భారీ విజయం సాధించకపోయిన కమర్షియల్‌గా హిట్ అయిందనే చెప్పాలి. ఇప్పుడు గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా సినిమా చేస్తున్నాడు శ్రీరామ్.
శ్రీరామ్ ఆదిత్య, ప్రియాంక దంపతులకు కుమారుడు జన్మించగా, అతనికి విక్రమ్ ఆదిత్య అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 16న విక్రమ్ ఫస్ట్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆది, శివ నిర్వాణ, నరేష్‌తో పాటు అశోక్ గల్లా హాజరయ్యారు. చాలా అట్టహాసంగా ఈ వేడుక జరిపించాడు శ్రీరామ్ ఆదిత్య.
శ్రీరామ్ తెరకెక్కిస్తున్న హీరో చిత్రంలో అశోక్ గల్లా ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఆయన సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటో గ్రఫీ అందిస్తున్నారు. నరేష్, సత్య, అర్చనా సౌందర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Wonderful event @SriramAdittya for your son’s 1st bro 🤗 wishing #VikramAdittya all the happiness in the world again 🤗 https://t.co/LaTqbVEHXR
— Ashok Galla (@AshokGalla_) September 16, 2021