టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay devarakonda), సమంత (Samantha) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఖుషీ. శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్నాడు. ఖుషీ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రీసెంట్గా కశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తోంది టీం. కాగా విజయ్, సామ్ లిటిల్ ఖుషీ (Kushi) తో దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ లిటిల్ ఖుషీ ఎవరనే కదా మీ డౌటు. శివనిర్వాణ కూతురు.
జిమ్ వేర్లో ఉన్న విజయ్-సామ్ శివనిర్వాణ కపుల్‌తో కలిసి దిగిన స్టిల్‌ను శివనిర్వాణ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఖుషీ అంటూ లవ్ ఎమోజీని పెట్టాడు. ఖుషీ చిత్రంలో కన్నడ యాక్టర్ జయరాం, సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
విజయ్ దేవరకొండ నటించిన లైగర్ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు పూరీ జగన్నాథ్‌తో జనగణమన కూడా చేస్తున్నాడు. సమంత కూడా తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది.