Dulquer Salmaan | కోలీవుడ్ స్టార్ హీరో దలపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. తమిళంలో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన లైకా ప్రొడక్షన్ బ్యానర్లో జేసన్ సంజయ్ తన మొదటి సినిమాకు సైన్ చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో హీరోగా మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌ను నటించనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దుల్కర్ ప్రీ ప్రొడక్షన్ లలో కూడా పాల్గొనన్నాడని సమాచారం. ఇక ఇదే నిజమైతే మాత్రం దళపతి విజయ్ కొడుకుకి బెస్ట్ హీరో దొరికేసినట్లే. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
దలపతి విజయ్‌కు ఇద్దరు పిల్లలు. కొడుకు జోసెఫ్ సంజయ్, కూతురు దివ్య శశి ఉన్నారు. ఇక సంజయ్ గతంలో ఉప్పెన సినిమాతో తమిళంలో హీరో ఎంట్రీ ఇస్తున్నాడని, విజయ్ సేతుపతి నిర్మాతగా ఉంటాడని పలు వార్తలు వచ్చాయి. దీంతో పాటుగా ప్రేమమ్ సినిమా దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ కూడా జేసన్ సంజయ్‌కు ఒక కథ చెప్పారట. అయితే సంజయ్ మాత్రం నటుడిగా కాకుండా దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. అంతేకాకుండా సంజయ్ లండన్‌లో డైరెక్షన్‌కు సంబంధించిన కోర్స్ కూడా చేశాడు. ఇక షారుఖ్ కొడుకు కూడా దర్శకుడిగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.