SSMB 29 | ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే కేవలం తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు.. హాలీవుడ్ జనాల్లో కూడా సూపర్ ఎక్జయిట్మెంట్ ఉంటుంది. జక్కన్న నుంచి వచ్చిన బాహుబలి ప్రాంఛైజీ, ఆర్ఆర్ఆర్ సినిమాలే ఇందుకు నిదర్శనం. తన రికార్డును తానే బీట్ చేసుకునే అరుదైన దర్శకుల్లో ఒకరు జక్కన్న. ఈ క్రేజీ స్టార్ డైరెక్టర్ నుంచి రాబోతున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఎస్ఎస్ఎంబీ 29 (ssmb29). ఇప్పటివరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి రాని థ్రిల్లింగ్ గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా ఈ సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే నెట్టింట కథనాలు హల్ చల్ చేస్తున్నాయి.
మహేశ్ బాబు (Maheshbabu) స్టార్‌డమ్‌ను హాలీవుడ్ సెలబ్రిటీల రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ఈ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు తాజా అప్డేట్తో క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ లేటెస్ట్ సమాచారం ఏంటంటే.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి చేయబోతున్న SSMB29 ఆర్ఆర్ఆర్కు మించి ఉండబోతుందని చెప్పారు పాపులర్ రైటర్ విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad).
అంతేకాదు జక్కన్నకు ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌ను కూడా తెరకెక్కించే ప్లాన్స్ ఉన్నాయని, ఇది జక్కన్న కాకుండా అతని పర్యవేక్షణలో వేరే డైరెక్టర్‌తో తెరకెక్కించే అవకాశాలున్నాయని విజయేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ కూడా అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. సీక్వెల్లో కూడా రాంచరణ్, తారక్ లీడ్ రోల్స్‌లో ఉండబోతున్నాయని చెప్పి మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తున్నారు.
ఎస్ఎస్ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టైన మహాభారత్ కూడా మహేశ్ బాబు జంగిల్ అడ్వెంచర్ మూవీ తర్వాత ట్రాక్‌పైకి వచ్చే ఛాన్స్ ఉందంటూ హింట్ ఇచ్చేశాడన్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి. మొత్తానికి విజయేంద్రప్రసాద్ ఒకేసారి మూడు సినిమాల అప్డేట్స్ ఇచ్చేసి అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నారంటున్నారు సినీ జనాలు.
ఇటీవలే లాంఛ్ చేసిన మహేశ్ బాబు గుంటూరు కారం మాస్ స్ట్రైక్ అభిమానులకు కావాల్సిన ఫుల్ మీల్స్ అందివ్వబోతున్నట్టు చెబుతోంది. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే జక్కన్న ప్రాజెక్టుతో బిజీగా కానున్నాడు మహేశ్ బాబు.
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..