‘తల్లీ కొడుకుల ఎమోషన్‌తో కూడుకున్న ఈ కథ మహిళలకు బాగా కనెక్టయ్యింది. ఈ సినిమాపై కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. దయచేసి అలాంటివారు తమ మైండ్‌సెట్‌ని మార్చుకోండి. సినిమాను దీవించండి. స్పాయిల్ చేయకండి. ఇండస్ట్రీని బతకనివ్వండి. అబద్ధాలు ఎన్ని చెప్పినా చివరకు గెలిచేది నిజమే. ఈ విజయమే ఆ నిజం’ అని అగ్ర నటి విజయశాంతి అన్నారు.
కల్యాణ్‌రామ్ హీరోగా విజయశాంతి కీలక పాత్రలో రూపొందిన యాక్షన్ ఎంటైర్టెనర్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన బ్లాక్‌బస్టర్ సక్సెస్‌మీట్‌లో విజయశాంతి మాట్లాడారు.
కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేసి బుధవారంలోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెబుతుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమా ఆడియన్స్‌కి నచ్చడానికి కారణం కొత్తదనమే. లాస్ట్ 20 నిమిషాలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. విజయశాంతిగారు లేకపోతే ఈ సినిమా లేదు. అడగ్గానే చేయడానికి ఒప్పుకున్నందుకు ఆమెకు థాంక్స్. తల్లిదండ్రులు లేకపోతే మనం లేము. వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. ఈ సినిమా చెప్పే నీతి అదే’ అని తెలిపారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.