విజయ రామరాజు టైటిల్‌రోల్ చేసిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకుడు. శ్రీని గుబ్బల నిర్మాత. విడుదలకు ముందే 46 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తున్నదని, ఇప్పటికే కేవలం ఇన్స్టాలోనే 16 మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్నదని, యూట్యూట్‌లో అయితే ఏకంగా 1.5 మిలియన్ల వ్యూస్ దాటిందని మేకర్స్ తెలిపారు.
తాజాగా ఈ సినిమా నుంచి తొలి గీతాన్ని గురువారం మేకర్స్ విడుదల చేశారు. ‘మేఘం వర్షించదా..’ అంటూ సాగే ఈ ప్రేమగీతాన్ని చిత్ర దర్శకుడు విక్రాంత్ రుద్రా రాయగా, విఘ్నేష్ భాస్కరన్ స్వరపరిచారు. కపిల్ కపిలన్, మీరా ప్రకాష్, సుజిత్ శ్రీధర్ ఆలపించారు. విజయ రామరాజు, కథానాయిక సీజా రోజ్ల కెమిస్ట్రీ ఈ పాటలో అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.