Thalapathy 68 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay), వెంకట్ ప్రభు (Venkat Prabhu)కాంబినేషన్లో కొత్త సినిమా వస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దళపతి 68గా పాన్ ఇండియా కథాంశంతో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజా అప్డేట్ ప్రకారం దళపతి 68 విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 22న గ్రాండ్‌గా లాంఛ్ కాబోతుందట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని ఇన్సైడ్ టాక్. ఈ మూవీలో ఎస్జే సూర్య విలన్‌గా నటించనున్నాడు.
ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నాడు. రానున్న రోజుల్లో ఈ క్రేజీ ప్రాజెక్టుపై పూర్తి వివరాలు వెల్లడికానున్నట్టు సమాచారం. విజయ్ ప్రస్తుతం దళపతి 67 (Thalapathy 67)గా తెరకెక్కుతున్న లియో సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. లియోలొ బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈచిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. కాగా ఈ మూవీకి డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ సంభాషణలు అందిస్తున్నారు. మాస్టర్ సినిమా తర్వాత లోకేశ్-విజయ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దళపతి 67పై అంచనాలు భారీగానే ఉన్నాయి.