నటుడిగా విజయ్ సేతుపతి ప్రతిభ దేశవ్యాప్తం. తమిళం, మలయాళం, హిందీలో ప్రస్తుతం ఆయన పదికి పైగా సినిమాల్లో నటిస్తూ అత్యంత బిజీ ఆర్టిస్ట్‌గా మారారు. విజయ్ సేతుపతి ఓ మూకీ సినిమాలో నటిస్తున్నారు. ‘గాంధీ టాక్స్’ అనే పేరును ఈ చిత్రానికి ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఒక డైలాగ్ కూడా ఉండదు. కేవలం హావభావాలతో కథ సాగుతుంటుంది.
విజయ్ సేతుపతి స్పందిస్తూ. …‘నటన అంటే ఆ సన్నివేశ వాతావరణాన్ని అర్థం చేసుకోవడం. అందుకే నాకు మాటల కంటే సీన్‌ను ఒంట బట్టించుకోవడంపైనే శ్రద్ధ ఎకువగా ఉంటుంది. సంభాషణలు అనేవి నటుడికి అతి తకువ ప్రాధాన్యత ఉండాలని నా అభిప్రాయం’ అని అన్నారు.