Merry Christmas | ఈ ఏడాది జవాన్ సినిమాలో విలన్‌గా స్టన్నింగ్ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi). తమిళంతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు భాషల్లో ఓ వైపు హీరోగా.. మరోవైపు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తూ.. సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ హీరో. ఇక తాజాగా విజయ్ సేతుపతి నటిస్తున్న మరో బాలీవుడ్ చిత్రం ‘మేరీ క్రిస్మస్’ (Merry Christmas). కత్రినా కైఫ్ కథనాయికగా నటిస్తుంది. బద్లాపూర్, అంధధూన్ సినిమాల ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే.. సినిమా మొత్తం క్రిస్మస్ పండుగ చుట్టూ తిరుగుతుండగా.. సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. ఇక ఈ ట్రైలర్‌ను రెండు భాషలలో మేకర్స్ కట్ చేశారు. మేరీ క్రిస్మస్ హిందీ ట్రైలర్‌కు, తమిళ ట్రైలర్‌కు చాలా తేడా కనిపిస్తుంది. రెండు ట్రైలర్లలో విజయ్, కత్రినా పాత్రలు ఇమాజినరీ లోకంలో మాట్లాడుతున్నట్లు, ఏదో దాచినట్లు సస్పెన్స్‌గా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, సంజయ్ కపూర్, దిను ఆనంద తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. టిప్స్ ఫిలింస్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.