VJS50 | ఇటీవలే జవాన్‌లో విలన్‌గా స్టన్నింగ్ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi). తమిళంతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు భాషల్లో ఓ వైపు హీరోగా.. మరోవైపు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తూ.. సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కొన్ని రోజుల క్రితం మక్కళ్ సెల్వన్ 50 (VJS50)) వ సినిమా అప్డేట్ ఇచ్చాడని తెలిసిందే.
Kurangu Bommai ఫేం నితిలన్ సామినాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ సేతుపతి 50వ ప్రాజెక్ట్‌కు మహారాజా టైటిల్‌ను ఫిక్స్ చేయగా.. కొద్ది సేపట్లో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన వీడియోలో.. రక్తం అంటిన విజయ్ సేతుపతి చేతుల్లో పదునైన ఆయుధం ఉండటం చూడొచ్చు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీ ఏ జోనర్లో ఉండబోతుందనేది ఫస్ట్ లుక్‌తో క్లారిటీ వస్తుందేమో చూడాలి మరి.
మక్కల్ సెల్వన్ మరోవైపు విజయ్‌సేతుపతి 51 (VJS51) కూడా చేస్తున్నాడు. ఈ మూవీ ఇప్పటికే మలేషియాలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. అరుముగ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 7Cs Entertaintment బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రొడక్షన్ నంబర్ 5గా వస్తోన్న ఈ మూవీలో రుక్మిణి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా..యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. విజయ్ సేతుపతి దీంతోపాటు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మేరీ క్రిస్మస్లో నటిస్తుండగా.. కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తుంది.
#MahaRaja (#VJS50) FIRST LOOK Releasing in Just 1 HOUR🔥♟️
Stars : Vijay Sethupathi – Anurag Kashyap – Mamtha Mohandas – Natty
Music : Ajeesh (Kantara)
Direction : Nithilan Swaminathan (Korangu Bommai)
Production : Passion Studio – The RouteWhat Goes Around Comes Around!!a pic.twitter.com/9bWPlN4rQb
— Saloon Kada Shanmugam (@saloon_kada) September 10, 2023
2 hours to go for the first look release of @VijaySethuOffl’s #VJS50 😎pic.twitter.com/KANeWHzYxb
— KARTHIK DP (@dp_karthik) September 10, 2023