Thalaivan Thalaivii OTT | తమిళ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi), నేషనల్ అవార్డు విన్నర్ నటి నిత్యా మీనన్ (Nithya Menon ) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తలైవన్ తలైవి’ (Thalaivan Thalaivii). తెలుగులో ఈ సినిమాను సార్‌మేడమ్ (SirMadam) పేరుతో డబ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం తమిళంలో జూలై 25న విడుదల కాగా.. తెలుగులో ఆగష్టు 01న ప్రేక్షకుల ముందుకు వచ్చి కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ని పంచుకుంది చిత్రయూనిట్. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఆగష్టు 22 నుంచి తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించగా.. టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు.
విజయ్ సేతుపతి, నిత్య మీనన్ ఇందులో భార్యభర్తలుగా నటించారు. పెళ్లి అయిన మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత ప్రతిదానికి చిరాకు, గొడవలు పడడం. ఈ వివాదాలు వారి వైవాహిక జీవితాన్ని వారి బిజినెస్‌ని ఎలా ప్రమాదంలో పడేస్తాయి అనేది ఈ సినిమా కథ.
Get ready to fall in love with Aagasaveeran and Perarasi… twice 👀#ThalaivanThalaiviiOnPrime, Aug 22@VijaySethuOffl @MenenNithya @pandiraaj_dir @iYogiBabu@Music_Santhosh @SathyaJyothi @Lyricist_Vivek @studio9_suresh@Roshni_offl @kaaliactor @MynaNandhini @ActorMuthukumar pic.twitter.com/VqI3bn7zqP
— prime video IN (@PrimeVideoIN) August 15, 2025