‘సినిమా చూశాను. చాలా బాగుంది. తండ్రిగా చాలా ఆనందంగా ఉంది. ఇది పక్కా మాస్ యాక్షన్ సినిమా. ఇందులో యాక్షన్ అంశాలు సెలబ్రేట్ చేసుకునేలా ఉంటాయి. ఒక ప్రేక్షకుడిగా సినిమా నాకు బాగా నచ్చింది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా కనెక్ట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాను. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ సినిమా చేస్తున్నాను. ఇంకో సినిమా చేస్తే తెలుగు బాగా మాట్లాడతాను. కవితలు కూడా రాస్తాను.’ అని విజయ్ సేతుపతి అన్నారు. ఆయన తనయుడు సూర్య సేతుపతి హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఫీనిక్స్’. యాక్షన్ డైరెక్టర్ అనల్ అరుసు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. రాజ్యలక్ష్మీ అరసు నిర్మాత. ఈ నెల 7న సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన విజయ్ సేతుపతి పై విధంగా స్పందించారు. ఈ సినిమాలో నటించడం పట్ల హీరో సూర్య సేతుపతి ఆనందం వెలిబుచ్చారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని దర్శక, నిర్మాతలు అనల్ అరసు, రాజ్యలక్ష్మి అరసు నమ్మకం వ్యక్తం చేశారు. అతిథులుగా విచ్చేసిన దర్శకుడు దర్శకుడు గోపీచంద్ మలినేని, నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.