విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఫీనిక్స్’. స్టంట్ కొరియోగ్రాఫర్ అనల్ అరసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటైర్టెనర్కు రాజలక్ష్మి అరసు నిర్మాత. ధనుంజయన్ తెలుగులో విడుదల చేస్తున్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది.ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్లో జరిగింది.
ఇందులో యాక్షన్ సీన్స్ ఓ స్థాయిలో ఉంటాయని, అందుకే ఏడాదిన్నరపాటు శిక్షణ తీసుకొని నటించానని సూర్య సేతుపతి తెలిపారు. ‘సూర్యకి గొప్ప భవిష్యత్ ఉంది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది.’ అని దర్శకుడు అనల్ అరుసు తెలిపారు. ఇంకా కథానాయిక వర్ష, రైటర్ భష్యశ్రీ, నిర్మాతలు ధనుంజయన్, రాజ్యలక్ష్మీ కూడా మాట్లాడారు.