Vijay Sethupati | కోలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతి, తన నటనతో ప్యాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. విభిన్న పాత్రల్లో నటిస్తూ, ‘డౌన్ టు ఎర్త్’ వ్యక్తిగా పేరొందిన ఆయనపై ఇటీవల ఒక బ్రిటిష్ సైకియాట్రీ డాక్టర్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. డాక్టర్ రమ్య మోహన్ అనే మహిళ తన సోషల్ మీడియా ఖాతాలో విజయ్ సేతుపతిపై “విమనైజర్”, “డ్రగ్ మానిప్యులేటర్ష అని బాంబు పేల్చారు. “కోలీవుడ్‌లో డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్ లేవు అనడం జోక్. ఓ అమ్మాయి మీడియా వృత్తిలో పని చేస్తూ ఇండస్ట్రీలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆమె రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతోంది. ఆమె బాధ చాలా తీవ్రమైనది అంటూ రమ్య తెలిపారు.
విజయ్ సేతుపతి పేరు ప్రస్తావిస్తూ..“అతను ‘కారవాన్ ఫేవర్’ కోసం రూ.2 లక్షలు, లాంగ్ డ్రైవ్స్ కోసం రూ.50 వేలు ఆఫర్ చేస్తూ పలువురితో మాట్లాడుతున్నాడని తెలిసింది. తాను బహిరంగంగా ‘సాధువులా’ ప్రవర్తిస్తున్నా, వెనుక ఎలా ఉంటాడో చాలామందికి తెలియదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే కొద్ది సేపటికే ఆమె ఆ పోస్ట్ డిలీట్ చేసింది. అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆరోపణలు చేసి కొద్దిసేపటికి ట్విట్లను డిలీట్ చేయడంతో చాలామంది ఫైర్ అవుతున్నారు. దానికి వివరణ ఇచ్చిన తాను కోపంలో అలా చేశాను, వైరల్ అవుతుందని అనుకోలేదు, స్నేహితురాలి గోప్యత కోసం డిలీట్ చేశానని రమ్య మోహన్ తెలిపింది.
ఇప్పుడు ఈ ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారడంతో విజయ్ సేతుపతి స్పందించారు. ఆ ఆరోపణలు ఏ మాత్రం నిజం కావు. ఇప్పటికే ఆమెపై సైబర్ క్రైమ్‌లో తన టీమ్ ఫిర్యాదు చేసిందని అన్నాడు. ఈ ఆరోపణలు విన్న తర్వాత ఇండస్ట్రీలోనే కాకుండా నన్ను ఇన్నాళ్లు చూసిన వారు కూడా నవ్వుతారు. ఇలాంటి వ్యాఖ్యలు నన్ను ఏ మాత్రం బాధించవు. కాని నా కుటుంబం, సన్నిహితులు ఓ మహిళ చేసిన ఆరోపణల వలన కలత చెందారు. ఇక్కడ అలాంటివి సహజం, వాటిని వదిలేయమని నా కుటుంబాన్ని కోరాను. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసమే ఇలా చేస్తుందని నాకు అర్ధమైంది. కొన్ని నిమిషాల పాటు ఫేమస్ అవుతుంది, దానిని ఆస్వాదించనివ్వండి అని విజయ్ సేతుపతి అన్నారు. ఏడు సంవత్సరాలుగా తాను ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఎన్నో ఫేస్ చేశారు. అవి నా మీద ఏ మాత్రం ప్రభావం చూపవు. అలాంటివి ఎప్పటికీ జరగవు అని స్ట్రాంగ్‌గా చెప్పారు విజయ్.