Vijay Sethupathi |తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాక్టర్లలో ఒకడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈ స్టార్ హీరో ప్రస్తుతం మేరీ క్రిస్మస్, ముంబైకర్, జవాన్, గాంధీ టాకీస్ సినిమాల్లో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అభిమానులకు మరో కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ అందించాడు మక్కళ్ సెల్వన్. అరుముగ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పూజా కార్యక్రమం ఇవాళ మలేషియాలో ఐపోహ్ సిటీలోని ఓ ఆలయంలో జరిగింది.
7Cs Entertaintment బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. విజయ్‌సేతుపతి 51 (Vijay Sethupathi 51)గా ప్రొడక్షన్ నంబర్ 5గా రాబోతున్న ఈ చిత్రంలో రుక్మిణి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. యోగిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది.
క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మేరీ క్రిస్మస్లో విజయ్ సేతుపతికి జోడీగా కత్రినా కైఫ్ నటిస్తుంది. ఈ సినిమాను టిప్స్ ఫిలింస్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ హిందీలో డైరెక్ట్‌గా నటిస్తోన్న తొలి సినిమా ఇదే.
మరోవైపు షారుఖ్‌ఖాన్-అట్లీ కాంబోలో వస్తున్న జవాన్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతారం ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
With the blessings of the almighty, I have now begun work on my next film. Featuring the one and only #MakkalSelvan @VijaySethuOffl in the lead, music by @justin_tunes. The pooja was held at a temple in #Ipoh in Malaysia this Need all your bestwish @iYogiBabu @rukminitweets pic.twitter.com/TP9qIoWloI
— 7Cs Entertaintment (@7CsPvtPte) May 19, 2023