‘ఆర్సీ17’లో విజయ్ సేతుపతి?
రామ్‌చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
రామ్‌చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ‘ఆర్సీ 17’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమా నవంబర్ 1న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభంకానుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమా కాస్టింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటికొచ్చింది.
ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రకోసం ప్రముఖ తమిళ నటుడు విజయ సేతుపతి తీసుకోవాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నట్లు తెలిసింది. విలక్షణ నటుడిగా పేరున్న విజయ్ సేతుపతి ఈ సినిమాలో భాగమైతే తమిళనాట కూడా ప్రాజెక్ట్‌పై హైప్ పెరిగే అవకాశముందని అంటున్నారు. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కించబోతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

