దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీలో విజయ్‌సేతుపతి ఓ ప్రత్యేకం. భాషలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు విజయ్‌సేతుపతి. రీసెంట్గా గోవాలో జరుగుతున్న ‘ఇఫీ’ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఇక కొన్నాళ్లపాటు విలన్ పాత్రలు పోషించకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ‘ నాకు స్టార్ హీరో అనిపించుకోవడం కంటే నటుడు అనిపించుకోవడమే ఇష్టం. అందుకే పాత్ర నచ్చితే చేసేస్తుంటా. కొన్నాళ్ల క్రితం కెరీర్లో కాస్త ఛేంజ్ ఉంటుందని విలన్‌గా చేయడానికి ఒప్పుకున్నా. ఆ సినిమా బాగా ఆడింది. దాంతో ఇక వరుసగా విలన్ వేషాలు రావడం మొదలైంది.
నేను చేయనన్నా వినేవాళ్లు కాదు. హీరోలు, దర్శకులు ఫోన్లు చేసి మరీ అడిగేవారు. కనీసం స్క్రిప్ట్ వినమంటూ బతిమాలేవాళ్లు. అక్కడే అసలు సమస్య మొదలయ్యేది. వాళ్ల ఎమోషనల్ ప్రెజర్ కారణంగానే చేయడానికి ఒప్పుకునేవాడ్ని. తీరా ఒప్పుకున్న తర్వాత సెట్లో వాళ్లు నన్ను నియంత్రించడానికి ప్రయత్నించేవారు. నాకు చాలా కోపం వచ్చేది. విలన్ పాత్రలు చేయడంలో నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ వాళ్ల ప్రవర్తనే అభ్యంతరకరంగా ఉండేది. దాంతో. అసలు విలన్ పాత్రలు చేయాలా? వద్దా? అనే మీమాంసతో సతమతమయ్యాను. ఇప్పుడు ఓ నిర్ణయానికొచ్చాను. కొన్నాళ్ల పాటు విలన్ పాత్రలు చేయను’ అంటూ కరాఖండీ చెప్పేశారు విజయ్‌సేతుపతి.