పాకం పూరీలు
ఒక గిన్నెలో మైదా, కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ గోరువెచ్చని నెయ్యి వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి అరగంటపాటు పక్కన పెట్టాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి చక్కెర వేసి అరగ్లాసు నీళ్లుపోసి తీగపాకం వచ్చేవరకు కలపాలి. పాకం వచ్చాక యాలకుల పొడి వేసి బాగా కలపాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పూరీలా ఒత్తి మధ్యలో నెయ్యి రాసి నాలుగు మడతలు వేసి మళ్లీ ఒత్తుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి, బాగా వేడయ్యాక..
కావలసిన పదార్థాలు
మైదాపిండి: ఒక కప్పు, ఉప్పు: తగినంత, నెయ్యి: పావు కప్పు, చక్కెర: ఒక కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఒక గిన్నెలో మైదా, కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ గోరువెచ్చని నెయ్యి వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి అరగంటపాటు పక్కన పెట్టాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి చక్కెర వేసి అరగ్లాసు నీళ్లుపోసి తీగపాకం వచ్చేవరకు కలపాలి. పాకం వచ్చాక యాలకుల పొడి వేసి బాగా కలపాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పూరీలా ఒత్తి మధ్యలో నెయ్యి రాసి నాలుగు మడతలు వేసి మళ్లీ ఒత్తుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి, బాగా వేడయ్యాక.. అప్పటికే చేసి పెట్టుకున్న పూరీలను రెండువైపులా కాల్చి చక్కెరపాకంలో వేయాలి. ఒక నిమిషం చక్కెర పాకంలో నానిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకుంటే నోరూరించే పాకం పూరీలు సిద్ధం. మైదా ఇష్టపడని వాళ్లు గోధుమపిండితోనూ చేసుకోవచ్చు.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

