Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
Explosion In Building | నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల బిల్డింగ్‌లో పేలుడు జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఐఈడీ పేలినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరు: నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల బిల్డింగ్‌లో పేలుడు జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఐఈడీ పేలినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. (Explosion In Building) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. మంగళవారం పులకేశినగర్ ప్రాంతంలోని జార్మియా రోడ్డు వద్ద నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నివాస భవనం ఐదో అంతస్తులో పేలుడు జరిగింది. ఇద్దరు కార్మికులకు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఆసుపత్రి వర్గాల ద్వారా ఈ పేలుడు సమాచారం పోలీసులకు తెలిసింది. దీంతో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్), ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ (ఐఎస్డీ), బాంబు నిర్వీర్య దళానికి చెందిన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ లభించిన పేలుడు వస్తువులను సేకరించారు. విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.
అయితే ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాతే ఆ పేలుడుకు కారణం ఏమిటన్నది తెలుస్తుందని కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతున్నదని మీడియాతో అన్నారు. ఆ భవనం కొంతవరకు వినియోగంలో ఉందని, మరికొంత భాగం నిర్మాణ దశలో ఉన్నట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
Telangana RTC Union Elections | తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ ఘన విజయం
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

