హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్(డీఎస్‌హెచ్)గా మార్చిన ప్రభుత్వం పూర్తి స్థాయి పరిపాలనా వ్యవస్థను చేపట్టి, ఉద్యోగోన్నతులను పూర్తి చేయాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్(టీజీజీడీఏ) డిమాండ్ చేసింది.
రాష్ట్ర అధ్యక్షుడు బీ నరహరి శనివారం ప్రకటన విడుదల చేశారు. రికార్డులు, ఉత్తర్వులు, వెబ్సైట్లు, పరిపాలనా వ్యవస్థలో డీఎస్‌హెచ్ పేరును అమలు చేయాలని కోరారు.