Vijay Sethupathy | తమిళ నటుడు విజయ్ సేతుపతి తన కొడుకు సూర్య సేతుపతికి సంబంధించిన వైరల్ వీడియో వివాదంపై స్పందించారు. సూర్య హీరోగా అరంగేట్రం చేసిన ‘ఫీనిక్స్’ సినిమా ప్రీమియర్ సందర్భంగా, తన కొడుకుకు సంబంధించిన కొన్ని వీడియోలను ఆన్లైన్ నుండి తొలగించమని విజయ్ సేతుపతి ఒత్తిడి చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై మక్కల్ సెల్వన్ స్పందించాడు.
విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చినట్లు అలాంటిది ఏదైనా జరిగి ఉంటే, అది తెలియకుండా జరిగి ఉండవచ్చు లేదా వేరొకరు చేసి ఉండవచ్చు. ఈ విషయంలో ఎవరైనా బాధపడినా లేదా ఉద్దేశాన్ని అపార్థం చేసుకున్నా నేను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను అని విజయ్ సేతుపతి చెప్పుకోచ్చాడు. సూర్య నటించిన ‘ఫీనిక్స్’ చిత్రం జూలై 4న విడుదలై పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది.
విజయ్ సేతుపతి సినిమాల విషయానికి వస్తే.. చివరిగా అరుముగ కుమార్ దర్శకత్వం వహించి, నిర్మించిన తమిళ రొమాంటిక్ క్రైమ్-కామెడీ ‘ఏస్’ చిత్రంలో కనిపించారు. ఇందులో రుక్మిణి వసంతతో పాటు యోగి బాబు, బీఎస్ అవినాష్, బబ్లూ పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించారు.
ప్రస్తుతం విజయ్ సేతుపతి పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్-కామెడీ ‘తలైవన్ తలైవీ’ చిత్రంలో కనిపించనున్నారు. సత్య జ్యోతి ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, యోగి బాబు, చెంబన్ వినోద్ జోస్, శరవణన్, ఆర్కె సురేష్, కాళి వెంకట్, మైనా నందిని, దీపా శంకర్, అరుళ్దాస్, వినోద్ సాగర్, రోషిణి హరిప్రియన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.