Ace Trailer | తమిళ కథానాయకుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఏస్ (Ace). ‘ఒరు నల్ల నాల్ పాత్తు సొల్రెన్’ చిత్రంతో విజయ్‌తో కలిసి పనిచేసిన ఆరుముగకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘ఏస్’ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించగా, యోగి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. 7Cs ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ నిర్మిస్తుంది. ఈ చిత్రం మే 23, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ చిత్రంతో రుక్మిణి వసంత్ తమిళంలో అరంగేట్రం చేస్తోంది. అలాగే, యోగి బాబు కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, బి.ఎస్. అవినాష్, ముత్తు కుమార్, రాజ్ కుమార్, డెనెస్ కుమార్, ఆల్విన్ మార్టిన్, ప్రిస్సిల్లా నాయర్, జాస్పర్ సుపయ్య, కార్తీక్ జై, నాగులన్ మరియు జహ్రినారిస్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.