Vijay-Rashmika | టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మధ్య ఉన్న బంధం గురించి చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఎప్పుడూ తమ వ్యక్తిగత జీవితంపై స్పష్టత ఇవ్వకుండా, నచ్చినట్లు తిరుగుతూ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఆగస్టు 15న రష్మిక షేర్ చేసిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మాత్రం వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీని తారా స్థాయికి తీసుకెళ్లింది. రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో విజయ్ దేవరకొండతో కలిసి దిగిన పలు ఫొటోలు షేర్ చేసింది. వీటిలో ఓ ఫోటో మాత్రం రొమాంటిక్ కోణాన్ని ఆవిష్కరిస్తుంది.
ఈ పిక్ సడెన్‌గా చూసిన వారంతా వీళ్లిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను ప్రకటించేశారా? అనే సందేహంలో పడ్డారు. అయితే వాస్తవం ఏంటంటే, ఈ పిక్స్ 2018లో విడుదలైన ‘గీత గోవిందం’ సినిమా షూటింగ్ టైమ్‌లో తీసిన ఫొటోలే. ఈ మూవీకి ఏడేళ్లు పూర్తైన సందర్భంలో రష్మిక ఈ మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది. ఆమె తన పోస్ట్‌లో “ఈ ఫొటోలు నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ‘గీత గోవిందం’ నా జీవితంలో చాలా ప్రత్యేకమైన సినిమా. 7 సంవత్సరాలు ఎలా గడిచాయో అర్థం కావట్లేదు,” అంటూ భావోద్వేగంతో రాసింది.
ఈ ఫొటోలు చూస్తూ నెటిజన్లు మాత్రం మరో కోణంలో కామెంట్లు పెడుతున్నారు. “విజయ్-రష్మిక లవ్ ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది”, “మీ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాం”, “ఫస్ట్ ఫోటో చూసే షాక్ అయ్యా” వంటి కామెంట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు ‘గీత గోవిందం’ అభిమానులు మాత్రం ఈ జంటను మళ్లీ స్క్రీన్‌పై చూడాలంటూ కోరుతున్నారు. గీత గోవిందం తర్వాత డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో ఈ ఇద్దరు కలిసి నటించారు. గీత గోవిందం పెద్ద హిట్ కాగా, డియర్ కామ్రేడ్ మాత్రం అంతగా అలరించలేకపోయింది.