కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, అందాల తార రష్మిక మందన్న జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘వారసుడు’. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీవీ సినిమా పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12న విడుదలవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఇదొక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమవుతున్నది.
సకుటుంబ ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్స్, హీరో విజయ్ మాస్ ఇమేజ్‌కు తగిన ఫైట్స్‌తో దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తున్నది. డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. వ్యాపారరంగంలో ప్రొఫెషనల్ రైవల్స్‌తో జరిగే పోటీలో తండ్రిని సమర్థుడైన వారసుడు ఎలా గెలిపించాడు అనేది కథగా ఉండనుందట. తమిళంలో ‘వరిసు’ పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రంపై క్రేజ్ నెలకొంది.