కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు కన్నడ హీరో యశ్ (Yash). ఈ చిత్రం యశ్‌తోపాటు డైరెక్టర్ ప్రశాంత్‌నీల్‌కు హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌కు కూడా మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఈ క్రేజీ కాంబినేషన్లో అదే మాస్ ఎనర్జీని కొనసాగిస్తూ కేజీఎఫ్ 2 కూడా మరోసారి ఇండస్ట్రీని షేక్ చేసింది.
స్టార్ యాక్టర్ యశ్ ఇప్పటివరకు కొత్త సినిమా ఏది ప్రకటించకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే యశ్ నుంచి కొత్త ప్రాజెక్ట్ ఏ జోనర్లో రాబోతుందంటూ మరోవైపు ఎక్జయిటింగ్‌గా కూడా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ 2 చివరలో దీనికి కొనసాగింపు కూడా ఉండొచ్చని హింట్ ఇచ్చి వదిలేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel). ఇపుడు మూవీ లవర్స్ లో జోష్ నింపే అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. కేజీఎఫ్ 3 (KGF 3)పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు విజయ్ కిరగందూర్.
కేజీఎఫ్ 3 షూటింగ్ 2025లో ప్రారంభం కాబోతుందని. ఈ ప్రాంఛైజీ 2026లో విడుదల కానుందని విజయ్ కిరగందూర్ (Prashanth Neel)తెలియజేశారు. అంతేకాదు రాబోయే రోజుల్లో నటీనటులు, సాంకేతిక నిపుణుల బృందంపై క్లారిటీ రానుందని హింట్ ఇచ్చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, విజయ్ కిరగందూర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సలార్ సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ మరోవైపు ఎన్టీఆర్31కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది తారక్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్.