అగ్ర హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రౌడీ జనార్దన్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. కీర్తి సురేశ్ ఇందులో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఓ తీర ప్రాంతంలో జరుగుతున్నది. ఈ తొలి షెడ్యూల్లో విజయ్, కీర్తీ సురేశ్లపై రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇందులో హీరోహీరోయిన్ల పాత్రలు కూడా నువ్వా-నేనా అనేలా ఉంటాయట. విజయ్ దేవరకొండ ఇందులో రౌడీ తరహా పాత్ర పోషిస్తుంటే, రౌడీ రాణిలా కీర్తి సురేశ్ పాత్ర ఉంటుందట. వీరిద్దరి మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు సినిమాకు హైలైట్గా నిలుస్తాయని తెలుస్తున్నది. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వివేక్ ఓబెరాయ్, సముద్రఖని ఇందులో ఇతర పాత్రధారులు.