Vijay Devarakonda-Goutham Tinnanuri Movie | లైగర్ ఫలితం విజయ్ను మాములు డిసప్పాయింట్ చేయలేదు. పాన్ ఇండియా రేంజ్లో హిట్టు కొట్టాలని రెండేళ్లు ఒళ్లు హూనం చేసుకుని కష్టపడ్డాడు. ప్రమోషన్లు గట్రా వీర లెవల్లో జరిపినప్పటికీ కంటెంట్ బెడిసి కొట్టడంతో వారం తిరిగేలోపే దుకాణం సర్దేసింది. ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ ఖుషీ సినిమాపైనే ఉన్నాయి. ట్రైలర్ సహా పాటలు జనాలకు ఓ రేంజ్లో ఎక్కేశాయి. మరో పది రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కోటి కొలిక్కి దశకు వచ్చేస్తున్నాయి. మైత్రీ సైతం ప్రమోషన్లు వీర లెవల్లో ప్లాన్ చేస్తుంది. ఇండిపెండెన్స్ డే రోజు జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్‌లో విజయ్, సమంత లైవ్ పర్ఫార్మెన్స్ మాములు హైప్ తీసుకురాలేదు. ఇక క్లీన్ యూ సర్టిఫికేట్ రావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం ఈ సినిమాపై సుమఖంగా ఉన్నారు.
ఓ వైపు విజయ్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లలో భాగం అవుతూనే.. మరోవైపు గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ను విజయ్ వెల్లడించాడు. ఈ సినిమా గ్యాంగ్‌స్టార్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుందని వెళ్లడించాడు. ఈ అప్డేట్ రౌడీ ఫ్యాన్స్‌లో మాములు ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయలేవు. గ్యాంగ్స్టార్స్ను అంతమొందించే పోలీస్ పాత్రలో విజయ్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రీ లుక్ పోస్టర్లో వీర లెవల్లో అంచనాలు పెంచేశాయి. పైగా జెర్సీ తర్వాత గౌతమ్ నుంచి వస్తున్న సినిమా కావడం.. అందులోనూ యాక్షన్ జానర్ కావడంతో జానల్లో అమితాసక్తి నెలకొంది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్డూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు.