టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా నటిస్తున్న పుష్పక విమానం (Pushpaka Vimaanam) చిత్రాన్ని సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. గీతా సైనీ, సాన్వీ మేఘన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 12న గ్రాండ్‌గా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో దేవరకొండ సోదరులిద్దరూ వినూత్నంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడంతోపాటు ప్రోమో వీడియో కూడా ఇటీవలే విడుదల చేశారు. విజయ్ దేవరకొండ ఏదో ఒక ఆసక్తికర కామెంట్ చేస్తూ సినిమాకు హైప్ క్రియేట్ చేస్తుంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి కూడా విజయ్ చేసిన కామెంట్ ఇపుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆనంద్ తన కంటే ముందే పెళ్లి చేసుకుంటాడని అందరికీ షాకిచ్చాడు విజయ్.
అయితే ఆనంద్ మాత్రం కొత్త అయిష్టంగానే తల ఊపినట్టు వీడియో ద్వారా తెలుస్తుంది. మరి ఆనంద్ నిజంగానే విజయ్ కంటే ముందే పెళ్లి పీటలెక్కుతాడా..? లేదంటే సినిమా కోసమే విజయ్ ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడా..? అనేది త్వరలో విడుదలయ్యే పూర్తి వీడియోతో తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rajinikanth | రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు: ట్విటర్ లో రజినీకాంత్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం