పోతురాజు పూనినట్ల పోతుగడ్డ ఆడదా
అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం విజయదశమి కానుకగా అక్టోబర్ 16న విడుదల కానున్నది.
ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం ఈ సినిమా నుంచి ‘కోబలి..’ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘రేగే ఉరుము దరువు నిన్ను ముట్టగా.. అష్టదిక్కులే పిక్కటిల్లవా.. జోగే రేయిలోన పగల సెగలిలా పొగులుతుండగా.. పగలు పుట్టదా.. మూగే సావునైన సంపడానికీ.. సత్తువియ్యరా.. కాలకాలుడా.. పెన్నే రెల్లెతేరు ఉరకలెత్తగా సిందు తొక్కమా భద్రమల్లడా.. సామీ.. నీ వరం.. కాదా ఆయుధం.. లోకం.. కన్ను సెదర పోతురాజు పూనినట్ల పోతుగడ్డ ఆడదా..’ అంటూ గూస్బంప్స్ తెప్పించే సంగీత సాహిత్యాలతో ఈ పాట సాగింది.
కేశవాదిత్య రాసిన ఈ పాటను అజయ్-అతుల్ స్వరపరచగా, వీఎం మహాలింగం మెస్మరైజ్ చేసేలా పాడారు. ఈపాటలో విజయ్ దేవరకొండ ఫెరోషియస్‌గా కనిపించారు. అర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడిగా నటించిన ఈచిత్రానికి రచన: ప్రమోద్ తమ్మినేని, కెమెరా: నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ, సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్‌కుమార్, టీసిరీస్ ఫిల్మ్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

