స్టార్ హీరో దేవరకొండ విజయ్ ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించారు. ‘హీరియే..’ సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ కంపోజర్, సింగర్ జస్లీన్ రాయల్ రూపొందించిన కొత్త పాట ‘సాహిబా’లో విజయ్ దేవరకొండ నటించారు.
ఆయనకు జోడీగా రాధిక మదన్ కనిపించనున్నారు. సుధాంశు సరియా ఈ మ్యూజిక్ ఆల్బమ్‌కి దర్శకుడు. సోమవారం విడుదల చేసిన ఈ సాంగ్ ప్రోమోలో దేవరకొండ విజయ్ ఫొటోగ్రాఫర్‌గా కనిపించారు. ‘సాహిబా’ కంప్లీట్ మ్యూజిక్ వీడియో ఈ నెల 15న విడుదల కానుంది.