Vijay Deverakonda | తక్కువ టైమ్‌లోనే పాన్ఇండియా స్టార్‌గా ఎదిగారు విజయ్ దేవరకొండ. సక్సెస్, ఫెయిల్యూర్లతో నిమిత్తం లేని మార్కెట్ ఆయనది. సినిమా విజయం సాధిస్తే.. ఆ వసూళ్లు టాప్‌గ్రేడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోవు. అదీ విజయ్ ఇమేజ్. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాకు వర్కింగ్ టైటిల్ ‘వీడీ 12’. గౌతమ్ తన్ననూరి దర్శకుడు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలోని పలు సుందరమైన ప్రదేశాల్లో జరిగింది. ఇప్పటివరకూ 60శాతం చిత్రీకరణ పూర్తయింది.
వచ్చే ఏడాది మార్చి 28న సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య తెలిపారు. ‘హిజ్ డెస్టినీ అవెయిట్స్ హిమ్’ అంటూ ఈ సినిమా పోస్టర్‌ను తన సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్ చేశారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ని ఈ నెలలోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుథ్ రవిచందర్.
ఇటీవల కేరళలోని వయనాడ్‌లో సంభవించిన వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగింది. ఈ నేపథ్యంలో వయనాడ్ బాధితులకు అండగా కేరళ ప్రభుత్వ సహాయనిధికి 5లక్షల విరాళాన్ని అందజేసినట్లు సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రకటించింది. ‘లక్కీ భాస్కర్’ టీమ్ తరపున ఈ విరాళాన్ని అందిచినట్లు పేర్కొంది.