టాలీవుడ్ (Tollywood) హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) తో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో చేస్తున్న లైగర్ (Liger) సినిమా మేకోవర్ పూర్తిగా మార్చేసుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. ఇక మరోవైపు ఇదే డైరెక్టర్ తో వార్, ఆర్మీ నేపథ్యంలో రాబోతున్న జనగణమన సినిమాను కూడా ఇటీవలే షురూ చేశాడు. కాగా ఎప్పుడూ తీరిక లేకుండా ఉండే ఈ అప్‌కమింగ్ పాన్ ఇండియా హీరోకు కొంత టైం దొరికినట్టుంది.
కంప్లీట్ ఫ్రెష్ లుక్‌లో కనిపిస్తున్న విజయ్ సరదాగా చల్లగాలిని ఆస్వాదించేందుకు చెట్ల మధ్యకు వెళ్లాడు. పచ్చని చెట్ల మధ్యలో ఉన్న దారి వెంబడి కూల్‌కూల్‌గా నడుచుకుంటూ వెళ్తుండగా..అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేస్తూ..లాంగ్ వాక్స్ (long walks)అంటూ ట్వీట్ పెట్టాడు విజయ్ దేవరకొండ. సిల్వర్ స్క్రీన్ అర్జున్ రెడ్డి తన వెకేషన్ ట్రిప్‌ను యూరప్‌లో జాలీగా గడుపుతున్నట్టు తాజా వీడియోతో తెలిసిపోతుంది.
లైగర్ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సీనియర్ నటి రమ్యకృష్ణ, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అనన్యపాండే (Ananya Pandey ) ఈ సినిమాతో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.