VIjay Devarakonda – Sahiba | రౌడీ హీరో విజయ్ దేవరకొండకి తృటిలో ప్రమాదం తప్పింది. మెట్ల మీద నుంచి దిగుతుండగా.. స్లిప్ అయ్యి జారి పడ్డాడు విజయ్. హీరియే (Heeriye) పాటతో క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ జాస్లీన్ రాయల్ విజయ్ దేవరకొండతో ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్న విషయం తెలిసిందే.
‘సాహిబా’ (Sahiba) అంటూ ఈ ఆల్బమ్ రానుండగా.. ఇందులో విజయ్ సరసన రాధిక మోహన్ నటిస్తుంది. ఇప్పటికే రాధికా- జస్లీన్ రాయల్ కాంబినేషన్లో వచ్చిన ‘నై జానా’ సాంగ్ సూపర్ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సాంగ్ ఎలా ఉండబోతుందని ప్రేక్షకుల ఎదురుచూస్తున్నారు. ఈ ఆల్బమ్‌కి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్‌లు విడుదల చేయగా.. ఆకట్టుకుంటున్నాయి. ఈ సాంగ్‌ను నవంబర్ 15న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సాహిబా ప్రమోషన్స్‌లో పాల్గోన్న విజయ్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఆల్బమ్ ప్రమోషన్స్ కోసం మెట్ల మీద నుంచి దిగుతుండగా.. విజయ్ జారి పడ్డాడు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
Why do we fall, sir (#Kushi, #FamilyStar)
So that we can learn to pick ourselves up (#VD12, #VD14)#VijayDevarakonda falls during #Sahiba promotions in Mumbai. But, nothing happened#VD #JasleenRoyal pic.twitter.com/rlqS2go6QD
— Vishnu Writess (@VWritessss) November 8, 2024