Dil Raju Dreams – Vijay Devarakonda | భారతీయ సినీ రంగంలో దిల్ రాజు పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన మొదటి సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న ఈ నిర్మాత, టాలెంట్‌ను గుర్తించడంలో దిట్ట. ఎంతోమంది హీరోలు, నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్లను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దిల్ రాజు, ఇప్పుడు మరో ముందడుగు వేశారు. తెలుగు సినీ పరిశ్రమకు మరింత టాలెంట్‌ను అందించే ప్రయత్నంలో భాగంగా, ఆయన కొత్త ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశారు.
కొత్త ప్రతిభను సినీ పరిశ్రమకు పరిచయం చేయాలనే లక్ష్యంతో దిల్ రాజు తాజాగా దిల్ రాజు డ్రీమ్స్(Dil Raju Dreams) అనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. తన కెరీర్ మొదలు నుంచి ఫ్రెష్ కంటెంట్, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించిన దిల్ రాజు, ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా యువ ప్రతిభావంతులకు అద్భుతమైన అవకాశాలు కల్పించనున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి “దిల్ రాజు డ్రీమ్స్” ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి రానుంది. అయితే ఈ వెబ్ సైట్ లాంఛ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో జరుగుతుండగా.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నటుడు విజయ్ దేవరకొండ రాబోతున్నాడు. ఈ విషయాన్ని దిల్ రాజు బ్యానర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఈ ప్లాట్ఫామ్లో భాగం కావాలనుకునేవారు https://dilrajudreams.com/ లింక్‌పై క్లిక్ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపాడు. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత, దిల్ రాజు డ్రీమ్స్ బృందం స్వయంగా వారిని సంప్రదిస్తుంది. సరైన ప్లాట్‌ఫామ్ దొరకక, సినీ పరిశ్రమలో పరిచయాలు లేక, ఎవరిని ఎలా సంప్రదించాలో తెలియక ఎంతోమంది టాలెంట్ ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారందరికీ ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్.
The MAN who backs the NEW WAVE 💥
Our @TheDeverakonda will be standing tall with fresh voices at the GRAND LAUNCH of #DilRajuDreams today from 6:30 PM onwards 🔥#DilRaju @DilRajuDreams pic.twitter.com/JWgvQAh3LV
— Sri Venkateswara Creations (@SVC_official) June 28, 2025