Vijay devarakonda | కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘ఖుషీ’ బృందం
Vijay devarakonda -Samantha Kushi movie | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఖుషి. నిన్నుకోరి, మజిలీ వంటి ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఖుషి సినిమా టైటిల్‌ను ఈ చిత్రానికి పెట్టడంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్ర బృందం కొత్త అప్డేట్ను ప్రకటించింది.
ఖుషి సినిమా కాశ్మీర్ షెడ్యూల్ పూర్తయినట్లు దర్శకుడు శివ నిర్వాణ ట్విట్టర్లో వెల్లడించాడు. విజయ్, సమంతలతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దాదాపు 20రోజులకు పైగా ఈ చిత్రం కాశ్మీర్లో షూటింగ్ జరుపుకుంది. ఈ షెడ్యూల్లో విజయ్, సమంత, వెన్నెల కిషోర్, శరణ్య పై సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ అధికారిగా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 23న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Amazing first schedule in kashmir
Thankyou @TheDeverakonda @Samanthaprabhu2 @vennelakishore #saranyapradeep and Whole #khushiteam 👏 congratulations
#khushiondec23 #khushi pic.twitter.com/jax2pkYRvS— Shiva Nirvana (@ShivaNirvana) May 23, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

