సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా యూత్‌లో తెగ ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్ దేవరకొండ. ఫ్యాషన్ బ్రాండ్‌తో ఈ యంగ్ హీరో తన అభిమానులకు మరింత చేరువయ్యాడు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే విజయ్ లేటెస్ట్గా ఇన్‌స్టా వేదికగా ‘ద దేవరకొండ బ్రాడ్కాస్ట్’ పేరుతో ఛానెల్‌ను ప్రారంభించాడు. దీనిద్వారా తన చిత్ర విశేషాలను, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు పంచుకుంటానని చెబుతున్నాడు విజయ్. ఇప్పటికే 1.86 కోట్ల మంది విజయ్ ఇన్‌స్టా అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. బ్రాడ్కాస్ట్ ఛానెల్‌తో ఫాలోవర్స్ సంఖ్య మరింత పెరగనుంది. మరోవైపు సమంతతో విజయ్ నటిస్తున్న ‘ఖుషీ’ సినిమా నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుందని సమాచారం.