అగ్ర హీరో విజయ్ దేవరకొండ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రముఖ ఫిల్మ్ మ్యాగజైన్ ఫిల్మ్‌ఫేర్.. విజయ్ దేవరకొండ ైస్టెలిష్ స్టిల్‌తో మే నెలకు సంబంధించిన కవర్‌పేజీని పబ్లిష్ చేసింది. ‘విక్టరీ మార్చ్’ అనే శీర్షికతో ఈ ముఖచిత్రాన్ని ముద్రించింది. అనతికాలంలోనే పాన్ ఇండియా స్టార్‌గా విజయ్ దేవరకొండ ఎదిగిన వైనాన్ని ఈ సంచికలో విశ్లేషించారు. ఈ ఎడిషన్‌లోని స్టిల్స్ విజయ్ దేవరకొండ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రంలో నటిస్తున్నారు.
గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ మూవీ జూలై 4న ప్రేక్షకుల ముందుకురానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలేర్పడ్డాయి. తాజాగా ఫిల్మ్‌ఫేర్ కవర్‌పేజీపై విజయ్ దేవరకొండ దర్శనమివ్వడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాతో పాటు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మరో పీరియాడిక్ కథలో నటించేందుకు విజయ్ దేవరకొండ సిద్ధమవుతున్నారు.