Vijay Devarakonda | టాలీవుడ్ యువ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రౌడి బాయ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సినిమాలతోనే హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇక గతేడాది బేబి (Baby) సినిమాతో బ్లాక్ బస్టర్ కూడా ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ కుర్ర హీరో పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండకు తన అన్న విజయ్ దేవరకొండ స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపాడు.
ఏదైనా గొడవ అయితే నాతో పాటు ఫస్ట్ తీసుకుపోయే అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్ డే ఆనంద్ దేవరకొండ. లవ్ యూ అంటూ రౌడి హీరో రాసుకోచ్చాడు. కాగా ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా తాను నటిస్తున్న మూవీ నుంచి కూడా అప్డేట్లు వచ్చాయి. ఆనంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘డ్యూయెట్’ (Duet). యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ ‘డ్యూయెట్’ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో కేఈ జ్ఞానవేల్ రాజా (KE Gnanavel Raja) నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఆనంద్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇక ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్గా నటిస్తోంది.
Also Read :
1.Ram Chran – Buchibabu Sana | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఆర్సీ 16’ మూవీకి ముహూర్తం ఫిక్స్
2. Bramayugam Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘భ్రమయుగం’.. ఎక్కడ చూడొచ్చంటే.?