Ram Chran – Buchibabu Sana | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ramcharan), ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సాన (BuchiBabuSana) కలయికలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇక ‘ఆర్సీ 16’ అని వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రలో జరిగే క్రీడా నేపథ్యంలో రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుండగా.. తాజాగా మూవీ లాంఛ్‌కు సంబంధించి సాలిడ్ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమాను మార్చి 20న అధికారికంగా లాంఛ్ చేయనున్నట్లు సమాచారం. మార్చి 20న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు జరపడంతో పాటు ప్రెస్‌మీట్ కూడా నిర్వహించబోతున్నారని టాక్. ఇక ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో కూడా రానున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాకు ‘పెద్ది'(Peddi) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే మర్చి 20 వరకు వెయిట్ చేయాల్సిందే.
ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ సమర్పిస్తున్నది. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై వెంకటసతీశ్ కిలారు అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉండే పవర్ఫుల్ స్క్రిప్ట్‌ని బుచ్చిబాబు సిద్ధం చేశారని యూనిట్ సభ్యులు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.