Bramayugam Movie | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన తాజా పాన్ ఇండియన్ థ్రిల్లింగ్ చిత్రం ‘భ్రమయుగం’ (Bramayugam). ఈ సినిమాకు భూతకాలం ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. వైనాట్ స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రానికి నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర అండ్ ఎస్. శశికాంత్ నిర్మించారు. ఫిబ్రవరి 15న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రేమలు సినిమాతో పోటిగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు 70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ వేదిక సోనిలివ్‌లో ఈ సినిమా ప్రస్తుతం తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని సోనిలివ్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇక ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో వచ్చింది. అంటే ఒక్క సన్నివేశం కూడా కలర్లో ఉండదు.
🔔 Malayalam movie #Bramayugam (2024) now streaming on Sony Liv.
Starring – Mammootty, Arjun Ashokan, Sidharth Bharathan & Amalda Liz.
Available in – Malayalam (Original), Tamil, Telugu, Kannada & Hindi.#BramayugamOnSonyLIV pic.twitter.com/u3UMEnwtRD
— Ott Updates (@Ott_updates) March 15, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 17వ శతాబ్దం మలబార్ తీరంలో ఓ రాజు ఆస్థానంలో పాటలు పాడే తక్కువ కులానికి చెందిన జానపద గాయకుడు దేవన్ (అర్జున్ అశోకన్). తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ తప్పిపోతాడు. గ్రామానికి వెళ్లే దారి తెలియక అడవిలో తిరిరి తిరిగి ఓ పాడుబడ్డ భవనంలోకి వెళ్తాడు. ఆ భవనంలో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్ భరతన్), మరొకరు కుడుమన్ పొట్టి(మమ్ముట్టి). చాలా కాలం తర్వాత తన ఇంటికి ఓ అతిథి వచ్చాడని చెప్పి దేవన్‌ను కొడుమన్ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానిస్తాడు. అయితే ఆ ఇంట్లోకి ప్రవేశించాక దేవన్‌కు చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. దీంతో దేవన్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా.. కొడుమన్ తన తాంత్రిక విద్యలతో అతణ్ని మళ్లీ ఇంటికి వచ్చేలా చేస్తాడు. అయితే చివరికి దేవన్ ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడ్డారా? అసలు కొడుమన్ పొట్టి ఎవరు. ఆ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.