Prabhas – Sandeep Reddy Vanga | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యానిమల్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’(Spirit) అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో సందీప్ రెడ్డి వంగా హీరోలు అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ), యానిమల్ (రణ్‌బీర్ కపూర్)లు అతిథి పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ వంగా అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది. ఈ సినిమా డిసెంబర్లో సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ పోలీస్ డ్రామాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనుండగా.. ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.