Vijay Antony | విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘తుఫాన్’. విజయ్ మిల్టన్ ఈ చిత్రానికి దర్శకుడు. కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా నిర్మాతలు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ని మేకర్స్ విడుదల చేశారు.
‘తుఫాన్‌లా..’ అంటూ సాగే ఈ పాటను భవ్యశ్రీ రాయగా.. విజయ్ ఆంటోనీ, అచ్చు రాజమణి కలిసి స్వరపరిచారు. హైమత్ మహమ్మద్ ఆలపించారు. హీరో పాత్రలోని సంఘర్షణని ఆవిష్కరిస్తూ ఈ పాటను తెరకెక్కించడం జరిందని మేకర్స్ చెబుతున్నారు. శరత్‌కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాశ్, మురళీశర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్ విజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్: విజయ్ మిల్టన్.