తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా ‘బిచ్చగాడు 2’. కావ్య థాపర్ నాయికగా నటిస్తున్నది. ఫాతిమా నిర్మాత. ఈ చిత్రానికి సంగీతం, ఎడిటింగ్‌తో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా వహిస్తున్నారు విజయ్ ఆంటోనీ. ఈ సినిమా థీమ్ సాంగ్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ..‘కోటీశ్వరుడైన కథానాయకుడు బిచ్చగాడిగా ఎందుకు వేషం వేశాడు. అతను చేపట్టిన యాంటి బికిలీ మిషన్ ఏంటి అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపిస్తున్నాం’ అన్నారు. ‘సంపన్నులే చరిత్రను రాశారు. వాళ్లకు పేదల బతుకుల గురించి తెలియదు. ఆ చరిత్రను మార్చి రాసేందుకు వస్తున్నాడు’ అంటూ థీమ్ సాంగ్‌లో సినిమా కాన్సెప్ట్ తెలియజేశారు చిత్రబృందం. దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : విజయ్ మిల్టన్, ఓం ప్రకాష్.