విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటారు హీరో విజయ్ ఆంటోని. తాజాగా ఆయన నటిస్తున్న 25వ చిత్రాన్ని ప్రకటించారు. ‘పరాశక్తి’ అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సందర్భంగా బుధవారం టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. అరుణ్ ప్రభు ఈ చిత్రానికి దర్శకుడు. ‘హృదయానికి హత్తుకునే కుటుంబ కథతో తెరకెక్కించబోతున్నాం.
మాస్, అంశాలతో ఆకట్టుకుంటుంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో భారీ వ్యయంతో తెరకెక్కించబోతున్నాం’ అని మేకర్స్ తెలిపారు. వాగై చంద్రశేఖర్, సునీల్కృష్ణ, సెల్మురుగన్, తృప్తి రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: షెల్లీ కాలిస్ట్, సంగీతం: విజయ్ ఆంటోని, రచన-దర్శకత్వం: అరుణ్ప్రభు.