హైదరాబాద్ : విజయ్ ఆంటోనీ. బహుముఖ ప్రజ్ఞ కలిగిన కళాకారుడు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా ఇలా భిన్న రంగాల్లో ప్రతిభను చాటిన విజయ్ ఆంటోనీ తాజాగా దర్శకత్వ విభాగంలోకి అడుగిడారు. తను నటించిన సూపర్‌హిట్ మూవీ బిచ్చగాడుకు సీక్వెల్‌గా వస్తున్న బిచ్చగాడు-2కు విజయ్ దర్శకత్వం బాధత్యలు చేపట్టాడు. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శక కుటుంబంలోకి స్వాగతం. ” పిచైకరన్ 2 “&ష బిచ్చగాడు 2 “లకు మీకు శుభాకాంక్షలు. 2022 బ్లాక్‌బస్టర్ మీ ముందు ఉందంటూ ట్వీట్ చేశారు.
మూవీ పోస్టర్లో కాళీ మాత ఉగ్ర అవతారంలో ఉంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన బిచ్చగాడు మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశ్చర్యకరమైన బ్లాక్ బస్టర్‌ను అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు సెంటర్లలలో ఈ మూవీ 100 రోజులకు పైగా ఆడింది. ఆంటోనీ తన కెరీర్లో ఇది చాలా ప్రత్యేకమైన చిత్రంగా అభివర్ణించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఫాతిమా విజయ్ ఆంటోనీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 2022లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.