Vijay Antony | విజయ్ ఆంటోనీ నటించిన పొయెటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘తుఫాన్’. విజయ్ మిల్టన్ దర్శకుడు. కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా నిర్మాతలు. ఈ నెల 9న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన వస్తున్నదని, ప్రేక్షకులకు ‘తుఫాన్’ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నదని మేకర్స్ చెబుతున్నారు.
శరత్‌కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాశ్, మురళీశర్మ, తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: భా ష్యశ్రీ, సంగీతం: అచ్చు రాజమణి, విజయ్ ఆంటోని.